హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయ కృష్ణన్, దినేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో పలు సమస్యలను సభ్యులు ఏకరవు పెట్టారు. వేసవి రీత్యా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయాలని, వైద్య సేవలను మరింత విస్తరించాలని, తగినంతమంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, విద్యుత్ కోత సమస్యలు లేకుండా చూడాలని జెడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ,పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు కోరారు. ఈ సందర్భంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైరపర్సన్, కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ గుల్లేపల్లి వద్ద కల్వర్టు నిర్మించి, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని, కింతలి–జాలంపల్లి రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.
● ఎక్కడా ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు అన్నారు. ఉచిత విద్యుత్ అంటూ బిల్లులు ఇస్తున్నారని,సెల్‌లో బిల్లులను సభలో చూపించారు. అనకాపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని,అలాగే ఉచిత విద్యుత్ సరఫరా 9 గంటలు ఇవ్వడం లేదని అన్నారు.కానీ ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు సర్కారు గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు
● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్‌ను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం,ఈర్లె అనురాధ కోరారు. ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా చేపట్టాలని మాడుగుల ఎంపీపీ రాజారామ్ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్‌గా తీసుకుని వీలైనంత త్వరగా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ అధికారులను ఆదేశించారు.
గిరిజనుల నుంచి విద్యుత్ బిల్లుల
వసూళ్లు ఆపాలి
గిరిజనులకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ బిల్లులు ఇవ్వటం సరికాదని, ఆ ప్రక్రియను సరిదిద్దాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలోని కొత్తలోసింగి, లోసింగి, పెదగరువు, పీత్రిగెడ్డ, నీళ్లబంద గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు. పునఃపరిశీలన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు.
Iవ పేజీ తరువాయి


