గ్యాస్ గోదాం వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు
మాడుగుల రూరల్ : భారత్ గ్యాస్ కోసం మాడుగుల సీతారామ గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం కూడా గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. ఈ నెల 20వ తేదీకి ముందు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. రెండు లారీల ద్వారా గ్యాస్ సిలిండర్లు రావడంతో గురువారం సుమారు 400 మందికి సిలిండర్లు పంపిణీ చేశారు. గురువారం కూడా గోదాం వద్ద తహసీల్దారు రమాదేవి, ఎస్‌ఐ నారాయణరావు గ్యాస్ సిలిండర్ల పంపిణీని పర్యవేక్షించారు.


