గ్యాస్ సరఫరా కోసం ఖాళీ కంచాలతో నిరసన తెలుపుతున్న గిరిజనులు
రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం కల్యాణపులోవలో ఖాళీ సిలిండర్లతో ఖాళీ కంచాలు పట్టుకుని గిరిజనులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ కొన్ని రోజులు నుంచి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయలేకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని రావికమతం వస్తేనే గ్యాస్ ఇస్తామని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఏజెన్సీ గ్రామాల్లో తరుచూ సిగ్నల్ సమస్య వస్తుందన్నారు. దిగువ గ్రామాలకు వచ్చి ఆన్‌లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రావికమతం ఏజెన్సీ వద్దకు వెళ్తే నాలుగు రోజులు తర్వాత ఇస్తామని చెప్పుతున్నారని వాపోయారు. గ్యాస్ ఏజెన్సీ వారు గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.


