కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు

Mar 27 2026 8:46 AM | Updated on Mar 27 2026 8:46 AM

పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్‌ఫోన్లు

పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్‌ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement