మాడుగుల రూరల్: గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని మాడుగుల నియోజకవర్గ పౌర సరఫరాల ఉప తహసీల్దారు(సీఎస్‌డీటీ) కె.రవిబాబు అన్నారు. మాడుగులలోని సీతారామ భారత్ గ్యాస్ గోదామును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రస్తుతం గోదాంలో 342 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఈ వారంలో ఆయిల్ కంపెనీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు రాకపోవడం వల్ల బ్యాక్‌లాగ్ ఎక్కువైపోయిందని సీఎస్‌డీటీ తెలిపారు. దీని వల్ల ఒకేసారి గోదాం వద్ద రద్దీ ఏర్పడిందని, గురువారం 500 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు అందించామన్నారు. రాబోయే రెండు రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంనది ఆయన స్పష్టం చేశారు.
ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో హోటళ్ల తనిఖీ
అనంతరం ఘాట్‌రోడ్డు జంక్షన్‌లోని పలు హోటళ్లను సీఎస్‌డీటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోదమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరాపల్లిలో కూడా హోటళ్లను తనిఖీ చేసి, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు రవిబాబు తెలిపారు.


