అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.


