అనకాపల్లి : మహిళల సమస్యల పరిష్కారం దిశగా ఈ నెల 13న జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాలో గల మహిళలు తమ సమస్యలు, ఫిర్యాదులను విన్నవించుకోవచ్చని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారి సూర్య లక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న శుక్రవారం విశాఖపట్నం జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం10 గంటలకు ’మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన మహిళా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. కావున అనకాపల్లి జిల్లా పరిధిలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


