ఆడ బిడ్డ పథకం అమలు ఎప్పుడు?
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎం చంద్రబాబునాయుడు మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టారు. ఆడబిడ్డ నిధికి ఏ బడ్జెట్‌లోనూ ఒక్క రూపాయి కేటాయించలేదు. 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వయస్సు మహిళలంతా ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్నారు. పథకం అమలు కాక ఒక్కో మహిళకు రూ, 54 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. గతంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అని చెప్పి మహిళలను మోసగించిన చంద్రబాబు ఇప్పుడు ఆడబిడ్డ నిధి విషయంలో అదే కుట్ర పన్నుతున్నారు.
– బి. వరలక్ష్మి, మండల మహిళా అధ్యక్షురాలు, బుచ్చెయ్యపేట


