నాతవరంలో అకాల వర్షం | - | Sakshi
Sakshi News home page

నాతవరంలో అకాల వర్షం

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 7:14 AM

నాతవరంలో అకాల వర్షం

నాతవరంలో అకాల వర్షం

నాతవరం: మండలంలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో పూత, పిందె దశలో ఉన్న జీడి, మామిడి తోటల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పూత రాలిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే జీడి, మామిడి తోటలకు తెగుళ్లు సోకడంతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు అకాల వర్షంతో మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో వరి పంట తర్వాత అధికంగా జీడి, మామిడి తోటల సాగుపై రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement