భూ సమస్యలకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు పరిష్కారం

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 7:14 AM

భూ సమ

భూ సమస్యలకు పరిష్కారం

అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దు

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

పీజీఆర్‌ఎస్‌కు–175, రెవెన్యూ క్లినిక్‌ కు–256 అర్జీలు

రెవెన్యూ క్లినిక్‌లో
ఎస్పీ కార్యాలయానికి 60 అర్జీలు

అర్జీదారుల సమస్య వింటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 60 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పదే పదే పునరావృతం అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ వారం భూ తగాదాలు – 30, కుటుంబ కలహాలు – 5, ఇతర విభాగాలకు చెందినవి – 25 అర్జీలు వచ్చాయన్నారు. ఆయా సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు దిగువస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన రావు, సిబ్బంది పాల్గొన్నారు.

తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ ద్వారా సత్వరమే పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో ఆమెతోపాటు జేసి శౌర్యమాన్‌ పటేల్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజను, మండల, గ్రామస్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌లో –175, రెవెన్యూ క్లినిక్‌లో 256 మొత్తం 431 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో కె.ఆర్‌.ఆర్‌.సి, బి.జె.ఆర్‌.ఎస్‌, ఎన్‌.ఎ.ఓ.బి, ఎ.పి.ఐ.ఐ.సి, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్‌. సుబ్బలక్ష్మి, మనోరమ, రామమణి, అనిత, సి.పి.ఓ జి.రామారావు, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.

కూటమి నాయకుల పేరిట దళితుల భూములు

సాగులో ఉన్న దళిత రైతుల భూములు కూటమి నాయకులు పేరున ఆన్‌లైన్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాకవరపాలెం మండలం రాచపల్లి, ఎరకన్నపాలెం గ్రామాల బాధిత రైతులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో సాగు చేసుకుంటూ బ్యాంకు రుణాలు తీసుకుంటున్నామని, ఎస్సీ కార్పొరేషన్‌ నిధులతో సదరు భూముల్లో బావి కూడా నిర్మించామని, తమ పేరున ఉన్న ఆన్‌లైన్‌ వివరాలు ఇతరుల పేరున ఎలా మారాయంటూ ప్రశ్నించారు. పీజీఆర్‌ఎస్‌లో రైతులు రావాడ సన్యాసిరావు, రావాడ గోవిందరావు, తదితరులు ఫిర్యాదులు చేశారు.

భూ సమస్యలకు పరిష్కారం 1
1/1

భూ సమస్యలకు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement