ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు

Feb 24 2026 7:14 AM | Updated on Feb 24 2026 7:14 AM

ఏటీఎం

ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు

నర్సీపట్నం: ఏటీఎం కార్డుల చోరీ నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం మండలం, ధర్మసాగరం గ్రామానికి చెందిన సుకల నూకరాజు జనవరి 17న నర్సీపట్నంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి నగదు డ్రా చేసేందుకు వచ్చాడు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియక నగదు డ్రా చేయమని నిందితుడిని ఆశ్రయించాడు. అతను నగదు తీసినట్టు నటించి డబ్బులు రావడం లేదని నకిలీ ఏటీఎం కార్డును నూకరాజుకు ఇచ్చి, అసలు ఏటీఎం కార్డు కాజేసాడు. దాంతో ఖాతా నుంచి రూ.15 వేలు నగదు డ్రా చేశాడు. నగదు డ్రా చేసినట్టు బాధితుడి సెల్‌కు మెసేజ్‌ రావడంతో అప్రమత్తమైన అతను వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించాడు. ఏటీఎం నుంచి నగదు డ్రా చేశారని మేనేజర్‌ తెలిపారు. బాధితుడు వెంటనే టౌన్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. సీఐ గపూర్‌, ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని పట్టుకు న్నారు. నిందితుడు మువ్వ వీరయ్య చౌదరి (41), ప్రకాశం జిల్లా, పరుచూరి మండలం, వీరన్నపాలేనికి చెందినవాడు. క్రైం టీమ్‌ సిబ్బంది నాని, సురేష్‌, నాగేంద్ర శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు ఉన్నాయి. జల్సాలకు అలవాటు పడి ఏటీఎం కార్డులను దొంగలించి నగదు తస్కరిస్తున్నాడు. సీఐ, ఎస్‌ఐ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు1
1/1

ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement