నిరుద్యోగులకు భృతి ఎక్కడ?
సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా నిరుద్యోగులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏటా జాబ్ చార్ట్‌ను ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. ఉద్యోగం కల్పించే వరకు నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల హామీలను పట్టించుకోలేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలి.
– గంతకర్ల సతీష్, గొట్లాం గ్రామం, కె.కోటపాడు మండలం


