మహిళలే గుణపాఠం చెబుతారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు అవుతుంది. ఇప్పటికి మూడు బడ్జెట్‌లు ప్రవేశపట్టారు. ఏ బడ్జెట్‌లో కూడా ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్ కేటాయించలేదు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారు అందరూ కూటమి ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద సంవత్సారానికి 18 వేలు వస్తాయని ఆశపడ్డారు. కానీ చంద్రబాబు అధికారం రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. బూటకపు హామీలతో మహిళలను మోసగించడం చాలా దారుణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారు.
–జనపరెడ్డి రాజు, కొత్తకోట గ్రామం, మండల వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు, రావికమతం


