అయ్యన్న పుత్రుడు అత్యుత్సాహం..!
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్
గొలుగొండ : కొత్తయల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిన్నకుమారుడు రాజేష్ సోమవారం నూతన భవనం ప్రారంబించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తయల్లవరం పంచాయతీ పరిధిలో గత వైఎస్సార్‌సీపీ పాలనలో భవన నిర్మాణం పూర్తి అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా అప్పటికి ప్రభుత్వం భవనాన్ని ప్రారంభించలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ కార్యాలయాలను ప్రజాప్రతినిధులు లేదా, ప్రభుత్వ అధికారులు ప్రారంభించాల్సి ఉంది. కానీ నర్సీపట్నంలో కౌన్సిలర్‌గా ఉన్న స్పీకర్ చిన్నకుమారుడు రాజేష్ గొలుగొండ మండలం కొత్తయల్లవరం పంచాయతీలో భవనం ప్రారంభించడం ప్రొటోకాల్ ఉల్లంఘనే అని స్థానికులు మండిపడుతున్నారు.


