సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Feb 24 2026 7:13 AM | Updated on Feb 24 2026 7:13 AM

సజావు

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

13,097 మంది తొలిరోజు పరీక్షలకు హాజరు 559 మంది గైర్హాజరు

అనకాపల్లి : ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభ మయ్యాయని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వినోద్‌బాబు అన్నారు. మొదటి సంవత్సర పరీక్షలకు 13,657 మంది విద్యార్థులకు 13,097 మంది పరీక్ష రాయడం జరిగిందని, 559 మంది గైర్హాజరు అయినట్టు తెలిపారు. జనరల్‌ విద్యార్థులు 11,147 మందికి 10,795 మంది పరీక్షలు రాయగా 351 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షకు 2,510 విద్యార్థులకు గాను 2,302 మంది పరీక్షలు రాయగా 208 గైర్హాజరైనట్టు వెల్లడించారు. కాగా నర్సీపట్నం గురుకుల కళాశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థి పోతురాజు అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలిసి డీఎస్పీ వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రికి పంపించి వైద్యం అందించి తిరిగి తీసుకువచ్చి పరీక్ష రాయించారు.

పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎస్పీ

అనకాపల్లి టౌన్‌ : పట్టణంలో సోమవారం ప్రారంభమైన ఇంటర్‌ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఏర్పాట్లను ఎస్పీ తుహిన్‌ సిన్హా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ క్రేంద్రం వద్ద మహిళా విద్యార్థుల తనిఖీ కోసం ఒక మహిళా కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌లను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను అమలులోకి తెచ్చామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధుల తల్లిదండ్రులు 100 మీటర్లు దూరంలో ఉండాలని, అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి లౌడ్‌ స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేసినా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకొనేలా, వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. పరీక్షలు ముగిసిన తరువాత పేపర్లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చే ప్రక్రియలో ఎస్కార్ట్‌ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం 1
1/3

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం 2
2/3

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం 3
3/3

సజావుగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement