పేదలను మోసం చేశారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. తాము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు సామాజిక పింఛన్ అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో వారందరూ కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. అయితే అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు మంజూరు చేయలేదు. 50 ఏళ్లు నిండిన వారంతా పింఛన్‌కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా పింఛన్‌కు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేవంటే ఈ ప్రభుత్వం తీరు అర్థమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసింది. – పెంటకోట స్వామి సత్యనారాయణ, జెడ్పీటీసీ, మునగపాక


