అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో వృద్ధుడు అదృశ్యం
రైల్వే స్టేషన్‌లో సీసీ పుటేజీలో
నమోదైన ప్రహ్లాద్ సాహు చిత్రం
అనకాపల్లి: స్థానిక రైల్వే స్టేషన్‌లో ఈనెల 14న ఓ వృద్ధుడు అదృశ్యమైనట్టు ఆదివారం రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందింది. రైలు నంబర్ 16107లో ఎస్4 కోచ్ నుంచి ప్రహ్లాద్ సాహు(74) అనే వృద్ధుడు ఆ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో రైలు నుంచి దిగినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గండలమ్ గొండల వీధికి చెందిన సాహు కోసం సీసీ ఫుటేజీ ఆధారంగా గాలిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


