చెట్టుపై నుంచి జారిపడి యువకుడు మృతి
మునగపాక: మండలంలో నాగులాపల్లికి చెందిన బందల మురళి అనే యువకుడు చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్టు ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. మురళి తన స్నేహితులతో కలిసి వివాహ వేడుకకు వెళ్లాడు.తిరుగు ప్రయాణంలో ఆదివారం నాగులాపల్లిలో మరో ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తూ సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన మురళిని అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


