విద్యార్థులకు మైహోం నగదు బహుమతులు
నగదు బహుమతులు అందుకున్న విద్యార్థులు
యలమంచిలి రూరల్: మండలంలోని 10 జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ములకలాపల్లి మైహోం ఇండస్ట్రీ్‌స్ ప్రైవేట్ లిమిటెట్ యాజమాన్యం ఆదివారం నగదు బహుమతులు అందజేసింది. కర్మాగారం గెస్ట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఒక్కో పాఠశాల నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 8, 9 తరగతుల్లో వారు సాధించిన మార్కుల ఆధారంగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆరుగురు విద్యార్థులను నగదు బహుమతులకు ఎంపిక చేశారు. మొదటి బహుమతి రూ.8వేలు, రెండో బహుమతి రూ.6వేలు, మూడో బహువతి రూ.4వేల చొప్పున మొత్తం రూ.1.8 లక్షలు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. సీఎస్‌ఆర్ నిధులతో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కర్మాగారం హెడ్ బి.రామస్వామి, సీనియర్ డీజీఎంమ్ (పీఅండ్‌ఏ) ఎల్.శ్రీనివాసరావు, సీఎస్‌ఓ డి.వెంకట్రావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


