బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా

Feb 22 2026 7:25 AM | Updated on Feb 22 2026 7:25 AM

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయవద్దంటూ ధర్నా

అనకాపల్లి: మండలంలో తుమ్మపాల పంచాయతీ పరిధి గాయత్రీనగర్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయవద్దంటూ గ్రామ మహిళలు శనివారం ధర్నా చేశారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన బోర్డు వద్ద వారు ఆందోళన చేశారు. బార్‌ ఓపెన్‌ చేస్తే ఎలాంటి ఉద్యమాలకై నా వెనకాడబోమని కాలనీ వాసులుహెచ్చరించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కాలనీవాసులతో మాట్లాడారు. బార్‌ యజమానిని పిలిచి మాట్లాడుతామని అంతవరకు ఆందోళన చేయవద్దంటూ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement