ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు మేడివాడ విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు మేడివాడ విద్యార్థి ఎంపిక

Feb 22 2026 7:24 AM | Updated on Feb 22 2026 7:24 AM

ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు మేడివాడ విద్యార్థి ఎంపిక

ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు మేడివాడ విద్యార్థి ఎంపిక

రావికమతం: మండలంలో మేడివాడకు చెందిన విద్యార్థి కోట్యాడ రాము ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు దివ్యాంగుల విభాగంలో ఎంపికై నట్లు మేడివాడ హైస్కూల్‌ ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు,భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయుడు జగన్నాథనాయుడు తెలిపారు. లడక్‌లో సన్నాహక శిక్షణ కార్యక్రమానికి ఎంపికై నట్లు వారు చెప్పారు. రాము గతంలో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ శిబిరానికి జోనల్‌ స్థాయిలో జరిగిన అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో విశేష ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో జరిగే శిక్షణకు ఎంపికయ్యాడు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని గండికోటలో నెల రోజుల పాటు శిక్షణ పాల్గొన్నాడు.శిక్షణ అనంతరం నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి మూడవదశలో లడక్‌లో జరిగే శిక్షణకు ఎంపికయ్యాడు.రాము ప్రసుత్తం కొత్తకోట జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. దివ్యాంగుడైన రాము చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నాడు.రామును అనకాపల్లి జిల్లా విద్యాశాఖా ధికారి గిడ్డి అప్పారావు నాయుడు,అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్య సమన్యయకర్త బి.రామకృష్ణ నాయుడు, కొత్తకోట కాలేజీ ప్రిన్సిపాల్‌ సత్యవతి, ఎంఈవోలు,ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement