62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీఏసీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి. పీఏసీఎస్‌లను అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి.
– సాయికిషోర్, క్లర్క్, కొండకర్ల పీఏసీఎస్
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కొక్కిరాపల్లి పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా కాంట్రాక్ట పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెరగలేదు. చాలీచాలనీ జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. కాంట్రాక్ట పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేస్తే జీతాలు పెరుగుతాయి. మా కుటుంబాలు జీవనం గడుస్తుందనే ఆశతోనే పనిచేస్తున్నాం.
– చిన్ని రమ్య, కంప్యూటర్ ఆపరేటర్,
కొక్కిరాపల్లి పీఏసీఎస్
62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేయాలి


