పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం

పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం

ఎస్పీ–సంపర్క్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్‌బీ డీఎస్పీ మోహన్‌

అనకాపల్లి: పోలీసుశాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఎస్‌బీ డీఎస్పీ జి.ఆర్‌.ఆర్‌.మోహన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్పీ–సంపర్క్‌(పోలీసు గ్రీవెన్స్‌) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను ఆన్‌లైన్‌లో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోంగార్డు నుంచి కానిస్టేబుల్‌ వరకు వారి వ్యక్తిగత సమస్యలను నేరుగా ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సెల్‌ నంబర్‌ 93469 12011కు తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో సి.హెచ్‌.తిలక్‌ బాబు, ఎస్‌ఐ ప్రసాద్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు దేవరాజు, భామాబాయి, ప్రేయర్‌ సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement