కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం ఉండొచ్చనని అంచనా
పథకం ప్రకారమే నిప్పు పెట్టారని బాధితుల ఆరోపణ
విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు
నాతవరం : గుర్తు తెలియని వ్యక్తులు కొబ్బరిమొక్కలు, సరుగుడు తోటలకు నిప్పు పెట్టడంతో సుమారుగా రూ.5 లక్షలు వరకు ఆస్తి నష్టం ఏర్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివి. మండలంలో మర్రిపాలెం గ్రామానికి చెందిన రుత్తల రాజేశ్వరి, కొరుప్రోలు అప్పలనాయుడుకు యల్లవరం దొండపేట రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయా భూముల్లో రైతులు కొబ్బరి, జీడి, సరుగుడు తోటలు సాగు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ తోటలకు బుధవారం నిప్పుపెట్టడంతో రుత్తల రాజేశ్వరికి చెందిన 55 కొబ్బరి మొక్కలు, రెండు ఎకరాల భూమిలో వేసిన సరుగుడు తోట పూర్తిగా కాలిపోయింది. వ్యవసాయ పొలంలో మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల రైతులు కేకలు వేయడంతో పరిగున వెళ్లి వెర్రిగెడ్డలో ఉన్న నీటితో మంటలను అదుపు చేశారు. అప్పటికే సరుగుడు తోట మధ్యలో వేసిన టేకు చెట్లు కాలిపోవడంతో రైతు అప్పలనాయుడు భోరున రోదిస్తున్నాడు. సరుగుడు తోట కలప నరికేందుకు వారం రోజులు క్రితం రూ.4 లక్షలకు వ్యాపారికి రైతు అప్పలనాయుడు విక్రయించాడు, కొంత మొత్తంలో అడ్వాన్సు ఇవ్వగా మిగతా డబ్బులు తోట కటింగ్ చేసే సమయంలో ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకున్నారు. సరుగుడు మరో రెండు రోజులు వ్యవఽధిలో కటింగ్ చేసేందుకు సిద్ధం అవుతుండగా గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో రైతుల ఆశలు బూడిదపాలయ్యాయి. కష్టపడి పెట్టుబడి పెట్టి పెంచుకున్న సరుగుడు తోట పంట చేతికందే సమయంలో కళ్ల ముందే దగ్ధం కావడంతో రైతు జీర్ణించుకోలేకపోతున్నాడు. రుత్తల రాజేశ్వరి గతంలో వ్యవసాయ పంటలు సాగు చేసేవారు కోతులు వ్యవసాయ ఉత్పత్తులు నాశనం చేయడంతో ఏడాది క్రితం కొబ్బరిమొక్కలు, జీడి తోట వేశారు. ఏపుగా పెరుగుతున్న కొబ్బరి మొక్కలు కాలిపోవడంతో దిగాలు చెందుతున్నారు. కాలిపోయిన సరుగుడు తోట, టేకు చెట్లు కొబ్బరి మొక్కల ఆిస్తి నష్టం విలువ అంచనా రూ.5లక్షలపైగా ఉంటుందని వెర్రిగెడ్డ రిజర్వాయరు నీటి సంఘం అధ్యక్షుడు అల్లు స్వామినాయుడు, రైతులు అభిప్రాయ పడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు గురువారం విలేకరులకు తెలిపారు.
కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం


