మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మళ్లీ మోసం చేసింది. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా సక్రమంగా బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా పలు పథకాల ఊసెత్తడం లేదు. అంతా గ్యాస్ క బుర్లు తప్పా చిత్తశుద్ధి కనిపించడం లేదు. అమలు చేయలేని హామీలు, వాగ్దానాలు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. వీటిపై చంద్రబాబు ప్రజలకు జవాబు చెప్పాలి.
– షేక్ ఉన్నీషా బేగం, కోఆప్షన్ మెంబరు, మాడుగుల


