50 ఏళ్లకే పింఛన్ ఎప్పుడిస్తారు.?
బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని
ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఆయన మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కనీస కేటాయింపు లేవు. పాత పింఛన్లను నిబంధనలు పేరుతో తగ్గించేసేశారు. కొత్త పింఛన్లు రెండేళ్లుగా ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుండడంతో 50 ఏళ్లు దాటిన బీసీ మహిళలు ఎంతో ఆశతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్పా ప్రజలకు చేసింది శూన్యం.
– కరక అప్పలరాజు, జిల్లా వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యుడు


