గుడి, బడి జాన్తానై..
చేయి తడిపితే చాలు
పాఠశాలలు, ఆలయాల సమీపంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు హోం మంత్రి ఇలాకాలోనూ ఇదే పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదులను పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు జిల్లాలో అనధికారికంగా వందలాది బెల్టు షాపులు బాటిల్‌పై రూ.20 అదనంగా అమ్మకాలు కొన్ని గ్రామాల్లో వేలం పాట నిర్వహించి బెల్టు దుకాణాల ఏర్పాటు
సాక్షి, అనకాపల్లి: ఒకటి కాదు..రెండు కాదు చంద్రబాబు ప్రభుత్వంలో బడి,గుడి పక్కన వందలాది బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు దగ్గరగా ఉండకూడదన్న నిబంధనలకు తిలోదకాలిచ్చేసి, విచ్చలవిడిగా బెల్టు షాపులు తెరుస్తున్నా పోలీసు, ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. పాఠశాలల పక్కన ఉన్న దుకాణాలను తొలగించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది. స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల అండతో సిండికెట్ వ్యాపారులు కనుసన్నుల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న సిండికెట్లు, ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలో రూ.3 లక్షల నుంచి రూ.11 లక్షల వరకూ వేలం పాట ద్వారా బెల్టు షాపులు దక్కించుకుని విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఈ సొమ్ములో సగం వాటా స్థానిక కూటమి ప్రజాప్రతినిధులకు, మిగిలిన సొమ్ములో మద్యం దుకాణదారులకు 30 శాతం, ఎకై ్సజ్ శాఖ అధికారులకు 20 శాతం కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం, నర్సీపట్నం, గొలుగొండ,నాతవరం, చోడవరం, రావికమతం, రోలుగుంట, యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, అనకాపల్లి, కశింకోట, సబ్బవరం,పరవాడ మండలాల్లో పుట్టగొడుగుల్లా అనధికారికంగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని వేలం పాట ద్వారా డబ్బులు చెల్లించి అమ్మకాలు చేస్తుంటే..మరికొన్ని మద్యం సిండికేట్లే తమ అనుచరులు, బంధువుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకూ అదనంగా ధర పెంచి అమ్ముతున్నట్లు సమాచారం.
ఆలయాలు, స్కూళ్ల సమీపంలో ఏర్పాటు చేసిన కొన్ని బెల్టు షాపులు ఇలా..
● పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపు కారణంగా విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారు.
● కోటవురట్ల మండలం పాములవాకలో ఆంజ నేయస్వామి ఆలయానికి సమీపంలో నాలుగు బెల్టు దుకాణాలు వెలిశాయి.
● నక్కపల్లిలో ఉపమాక వేంకటేశ్వరరావు స్వామి ఆలయానికి వెళ్లే దారిలో మద్యం షాపు ఏర్పాటు చేశారు.
● అనకాపల్లి పట్టణంలో నెహ్రూచౌక్‌లో జీవీఎంసీ హైస్కూల్ నుంచి 50 మీటర్ల దూరంలో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. గూడ్స్‌రోడ్డులో షిర్డీ సాయిబాబా మందిరం వద్ద మద్యం దుకాణం, బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. తుమ్మపాలలో మరిడిమాండ అమ్మవారి ఆలయం వద్ద మద్యం దుకాణం ఉంది.
● కొత్తూరు జంక్షన్ సమీపంలో ఏఎంఎల్ కళాశాల దగ్గరగా మద్యం షాపు ఉంది. సీహెచ్‌ఎన్ అగ్రహారంలో జిల్లా పరిషత్ ప్రభుత్వం పాఠశాల సమీపంలో, కొండుపాలంలో జెడ్పీ హైస్కూల్ సమీపంలో బెల్టుషాపులు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు.
● కశింకోటలో సంత బయలు ప్రాంతంలో ప్రైమరీ, హైస్కూల్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు.
● చోడవరం మండలంలో పీఎస్ పేటలో ప్రభుత్వ పాఠశాల సమీపంలో, గవరవరంలో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో బెల్టుషాపులు ఏర్పాటు చేశారు.
● నర్సీపట్నం టౌన్‌లో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో మద్యం షాపు ఉంది. ఎండోమెంట్ ఆధీనంలో లేదని అధికారులు చెబుతున్నారు.
గొడిచెర్ల ప్రాథమిక పాఠశాలలో
తాగి వదిలేసిన మద్యం బాటిల్
600 బెల్ట్ షాపులు
జిల్లాలో 24 మండలాల్లో 520 గ్రామాలుంటే సుమారు 600 వరకూ బెల్టు షాపులున్నట్లు సమచారం. 100కు పైగా బెల్టుషాపులు స్కూళ్లు, ఆలయాలకు సమీపంలోనే ఉన్నాయి. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోని ఎస్.రాయవరం మండలంలో బంగారమ్మపాలెంలో అత్యధికంగా రూ.24 లక్షలకు బహిరంగ వేలం ద్వారా బెల్టు షాపు కేటాయించారని సమాచారం.
గుడి, బడి జాన్తానై..
గుడి, బడి జాన్తానై..
గుడి, బడి జాన్తానై..


