విశాఖలో సముద్ర, గగన వైభవం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో సముద్ర, గగన వైభవం

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 9:32 AM

విశాఖ

విశాఖలో సముద్ర, గగన వైభవం

ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము

ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

ఏయూ క్యాంపస్‌: విశాఖ తీరాన అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ వేళ సముద్రం–గగనం ఒకేసారి ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. విశాఖపట్నం వ్యూహాత్మక ప్రాధాన్యత మరోసారి ప్రతిష్టాత్మక వేదికగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆరు వరుసల్లో లంగరేసిన 71 దేశీ–విదేశీ నౌకలు క్రమశిక్షణకు ప్రతీకగా మెరిశాయి. ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ ముందుకు సాగుతుండగా యుద్ధనౌకలపై సైనికుల సెల్యూట్‌, గాల్లో మిగ్‌–29కే, డోర్నియర్‌, చేతక్‌ హెలికాఫ్టర్ల విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సముద్ర శక్తి సామర్థ్యాన్ని చాటింది. రెస్క్యూ డైవర్స్‌ టెన్‌–టెన్‌ విధానంలో సముద్రంలోకి దూకి నిర్వహించిన ఆపరేషన్లు, హాక్‌ విమానాల వేగవంతమైన ఫ్లైపాస్‌లు యుద్ధ సన్నివేశాలను తలపించాయి. ‘సురక్షిత సముద్రం–సమృద్ధి భారత్‌’ సంకల్పంతో భారత నావికాదళం క్రమశిక్షణ, సేవాభావం, సాంకేతిక నైపుణ్యాల సమన్వయాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్జనల మధ్య గగన విన్యాసాలుం ప్రపంచ ఐక్యత సందేశంతో విశాఖ తీరం మరోసారి చరిత్రలో నిలిచింది.

విశాఖలో సముద్ర, గగన వైభవం1
1/2

విశాఖలో సముద్ర, గగన వైభవం

విశాఖలో సముద్ర, గగన వైభవం2
2/2

విశాఖలో సముద్ర, గగన వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement