మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వివాహ ఆహ్వానం
మాడుగుల రూరల్: వి.మాడుగుల మండలం ఎం.కో డూరు సర్పంచ్ గొల్లవిల్లి సంజీవిరావు, రాష్ట్ర తూర్పు కాపుకార్పొరేషన్ మాజీ డైరెక్టరు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గొల్లవిల్లి ప్రభావతి దంపతుల కుమార్తె డాక్టర్ కల్పన వివాహానికి మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడితో కలిసి వెళ్లి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బుధవారం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు. వచ్చే నెల 5న ఎం.కోడూరులో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులను వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అంక్షితలు వేసి దీవించారు. మాజీ డిప్యూ టీ సీఎం బూడిముత్యాలనాయుడు,సంజీవరావు, ప్రభావతి, వధూవరులు డాక్టర్ కల్పన,జగదీష్, కోరుకొండ వెంకట సత్తిబాబు, కుమారి దంపతులు, కోరుకొండ గణేశ్ కుమార్, గొల్లవిల్లి మణిదీప్, పోతిన జగదీష్, వడ్డాది గణేష్ వారి వెంట ఉన్నారు.


