రెవెన్యూ క్లినిక్‌ అర్జీలకు సత్వరమే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలకు సత్వరమే పరిష్కారం

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 9:32 AM

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలకు సత్వరమే పరిష్కారం

రెవెన్యూ క్లినిక్‌ అర్జీలకు సత్వరమే పరిష్కారం

తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ రెవెన్యూ అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ, సర్వే, భూ రికార్డులు, పౌర సరఫరాలపై మండల, డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేతస్థాయిలో మానిటరింగ్‌ చేసి, జాప్యం లేకుండా త్వరితగతిన ప్రజలకు రెవెన్యూ సేవలందించాలన్నారు. జిల్లాలో వివాద రహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ సేవలు, భూముల మ్యాపింగ్‌, రికార్డులు అప్‌డేషన్‌, మ్యుటేషన్‌ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమ ర్పించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ చేయాలన్నారు. నీటి తీరువా పన్ను వసూలు కోసం ప్రతి మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణ రావు, ఎన్‌ఏవోబీ, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు కె.మనోరమ, ఎస్‌.సుబ్బలక్ష్మి, ఆర్డీవో షేక్‌ ఆయిషా, అన్ని మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్‌ పరిపాలన అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement