పాయకరావుపేట నియోజకవర్గానికిరూ.5 కోట్లు కేటాయిస్తా | - | Sakshi
Sakshi News home page

పాయకరావుపేట నియోజకవర్గానికిరూ.5 కోట్లు కేటాయిస్తా

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 9:32 AM

పాయకరావుపేట నియోజకవర్గానికిరూ.5 కోట్లు కేటాయిస్తా

పాయకరావుపేట నియోజకవర్గానికిరూ.5 కోట్లు కేటాయిస్తా

ఎంపీ గొల్లబాబూరావుకు అడ్డురోడ్డులో

స్వాగతం పలుకుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఎంపీ గొల్ల బాబూరావు

ఎస్‌.రాయవరం: పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.5 కోట్లు కేటాయిస్తానని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు తెలిపారు. బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయనకు అడ్డురోడ్డులో వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంపీ నిధులు కేటాయించి పూర్తి చేస్తానని తెలిపారు. గొల్ల బాబూరావుకు స్వాగతం పలికిన వారిలో మాజీ జెడ్సీటీసీ సభ్యుడు కశింకోట నీలేంద్రరావు,మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మామిడి చంటి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు శ్రీపతిరాజు, ఎస్‌.రాయవరం పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ అల్లాడ నాగరా జు, వాకపాడు సర్పంచ్‌ మైలపల్లి శ్రీనివాసరావు, శ్రీరామ్‌శెట్టి, నాగరాజు, చింతలపూడి మణిరాజు,యేజర్ల సీతారామరాజు,కోన దుర్గబాబు,కొంకిపూడి రామకృష్ణ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement