ప్రణాళికతో విజయం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో విజయం

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

ప్రణాళికతో విజయం

ప్రణాళికతో విజయం

పరీక్షా కాలం..

సాక్షి, అనకాపల్లి :

ప్రతీ విద్యార్థి జీవితంలో వారు కోరుకున్న విధంగా వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగైన పదిని పదిలంగా దాటాలి. పదిలో ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తే అది వారి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరడానికి సోపానంగా మారుతుంది. విద్యార్థుల పట్టుదల.. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం తోడైతే గమ్యాన్ని ఇట్టే చేరుకోవచ్చు. వచ్చే నెల 16 నుంచి 29 వరకూ పది పరీక్షల షెడ్యూల్‌ కూడా ఇప్పటికే విడుదలైంది. రానున్న నెల రోజులు పది విద్యార్థులకు పరీక్షా కాలమే. సమయం దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆహారం, నిద్ర గురించి ఆలోచించక చదువులో లీనం అవుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడంలో అభ్యాసంతో పాటు ఆహారం, ఆరోగ్యం ఎంతో ప్రధానం..అంతేకాకుండా విద్యార్థులకు ఒత్తిడిని అధిగమిస్తేనే ఏకాగ్రత దరి చేరుతుందని విద్యా నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 102 పరీక్ష కేంద్రాల్లో 21,017 మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

మార్చి 16 నుంచి 29 వరకు పది పరీక్షలు

ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు

జిల్లాలో 102 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

మొత్తం 21,017 మంది విద్యార్థులు

వీటిలో 71 ఓపెన్‌ స్కూళ్లలో 531 మంది విద్యార్థులు

ఆహారం..ఆరోగ్యం ఎంతో ప్రాధాన్యం

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement