శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం...
పదో తరగతిలో ఇప్పటి వరకూ పెట్టిన పరీక్షల్లో పాస్ మార్కులకు దిగువన, సమీపంలో ఉన్న యావరేజ్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ప్రశ్నల ఆధారంగా సిలబస్ తయారు చేశాం. 30 రోజుల్లో ఈ సిలబస్‌ను రివిజన్ చేయడంతో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాం. దీంతో ప్రతీ పాఠశాలలో శత శాతం ఉత్తీర్ణత సాధ్యమవుతుంది. ప్రతీ క్లాస్‌లో ఫస్ట్ క్లాస్, ఆపై మార్కులు వచ్చిన విద్యార్థులకు పూర్తి సిలబస్ ఆధారంగానే రివిజన్ ఉంటుంది. పాస్ బొర్డర్‌కు సమీపంలో ఉన్న విద్యార్థులే లక్ష్యంగా 30 రోజుల ప్రణాళిక రూపొందించాం. అదేవిధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక క్లాసులు కూడా ఏర్పాటు చేశాం.
– జి.అప్పారావు నాయుడు, డీఈఓ, అనకాపల్లి జిల్లా..
విద్యార్థుల ఆహారంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి..
పరీక్షలకు నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో ఎంత ఆరోగ్యకరమైన, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యం ఉంటారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఎక్కువగా పండ్లు, వాటర్, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటే ఆహారం, రాత్రి సమయంలో పాలు వంటివి తీసుకోవాలి. విద్యార్థులు తినే ఆహారం విషయంలో తల్లిదండ్రులు గమనిస్తుండాలి. బయట ఆహారాలు, పాస్ట్ ఫుడ్స్ వంటివి తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ లక్ష్మీకాంత్, చిల్డ్రన్ వైద్య నిపుణులు, నర్సీపట్నం రాజశేఖర్ ఆసుపత్రి
శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం...


