ముగిసిన కల్యాణపులోవ తిరునాళ్లు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కల్యాణపులోవ తిరునాళ్లు

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

ముగిసిన కల్యాణపులోవ తిరునాళ్లు

ముగిసిన కల్యాణపులోవ తిరునాళ్లు

● శివరాత్రి ఉత్సవాల మూడు రోజుల ఆదాయం:రూ 17.81లక్షలు

● శివరాత్రి ఉత్సవాల మూడు రోజుల ఆదాయం:రూ 17.81లక్షలు

హుండీ లెక్కిస్తున్న శ్రీవారి భక్తులు

రావికమతం : చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి 17 తేదీ వరకూ మూడు రోజుల పాటు తిరునాళ్లు జరిగాయి. ఈ సందర్భంగా శివరాత్రి ఉత్సవాల్లో మూడు రోజులు భక్తులు భారీగా తరలివచ్చి పోతురాజుబాబు, పెద్దింటమ్మను దర్శించుకుని కానుకలు సమర్పించుకున్నారు. మంగళవారం ఎండోమెంటు అధికారులు, పోలీసు సిబ్బంది సమక్షంలో శ్రీ వారి భక్తులతో హుండీలను లెక్కించారు. వివిధ రూపాల్లో భక్తులు రూ 17.81 లక్షలు స్వామి వారికి సమర్పించా రు. హుండీలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ 11,48,362, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ 3,55,330 ,స్వామి వారి ప్రసాదం విక్రయాల ద్వారా రూ 1,23,290, కేశ ఖండన ద్వారా రూ 44,275 ఆదాయం వచ్చిందని ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement