నులి పురుగుల రహిత సమాజానికి కృషి | - | Sakshi
Sakshi News home page

నులి పురుగుల రహిత సమాజానికి కృషి

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

నులి పురుగుల రహిత సమాజానికి కృషి

నులి పురుగుల రహిత సమాజానికి కృషి

● నులి పురుగుల నివారణ దినోత్సవంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

విద్యార్థినికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తున్న దృశ్యం

పరవాడ: నులిపురుగుల రహిత సమాజమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. పరవాడ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో హైమావతి మాట్లాడుతూ నులిపురుగుల వ్యాధి రాకుండా పిల్లలంతా ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలన్నారు. కలెక్టర్‌ స్వయంగా మాత్రలు పిల్లలకు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement