స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలి
నక్కపల్లి: మండలంలో ఆర్సిలర్‌మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ప్లాంట్ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో నిర్వాసితులు, ప్రజలు అడిగిన డిమాండ్లను నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, స్టీల్‌ప్లాంట్ ప్రభావిత గ్రామాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నక్కపల్లిలో వారు విలేకర్లతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు, పరిసర ప్రాంత గ్రామాల వారికి, నిర్వాసితులకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో ప్రజాభిప్రాయసేకరణకు ఈ ప్రాంత ప్రజలు సహకరించారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు వల్ల ఉపాధి కోల్పోతున్న యాదవులు, మత్స్యకారులు, ఇతర చేతి వృత్తుల వారికి నష్టపరిహారం చెల్లించాలని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరినట్టు చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ జరిగి మూడు నెలలు గడుస్తున్నా తమ డిమాండ్ల పై ప్రభుత్వంగాని, స్టీల్‌ప్లాంట్‌యాజమాన్యం గాని ఇంతవరకు స్పందించలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో చిన్నపాటి సివిల్‌పనులు కూడా స్థానికులకు కేటాయించాలని కోరామన్నారు. ఈప్రాంత రైతుల విన్నపాలను విస్మరించి యాజమాన్యం స్థానికేతరులకు పనులు అప్పగిస్తోందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూములు చుట్టూ ఫెన్సింగ్, రక్షణ గోడ నిర్మించే పనులు ప్రారంభమయ్యాయని, చిన్నచిన్న సివిల్‌పనులను సైతం స్థానికులకు కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేప్రాంతాల్లో పశువులు గొర్రెలు మేపుకొని యాదవులు జీవిస్తుంటారని, వీరు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వీరికి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో చేసిన డిమాండ్లను నెరవేర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే స్టీల్‌ప్లాంటకు కేటాయించిన భూముల్లో నివాస ప్రాంతాలు, మామిడి, జీడి తోటలను ఖాళీ చేసేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈసమావేశంలో వైస్‌ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గంటా తిరుపతి రావు, రైతు నాయకులు సూరాకాసుల గోవిందు, తళ్ల భార్గవ్, మడగల గోవిందు, పిక్కితాతీలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం


