కేజీహెచ్‌లో ‘మెమరీ క్లినిక్‌’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో ‘మెమరీ క్లినిక్‌’ ప్రారంభం

Nov 29 2025 7:09 AM | Updated on Nov 29 2025 7:09 AM

కేజీహెచ్‌లో ‘మెమరీ క్లినిక్‌’ ప్రారంభం

కేజీహెచ్‌లో ‘మెమరీ క్లినిక్‌’ ప్రారంభం

మహారాణిపేట: కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగంలో శుక్రవారం మెమరీ క్లినిక్‌ ప్రారంభమైంది. ఈ క్లినిక్‌ ఏర్పాటుకు ఈసాయి ఫార్మా సంస్థ సహాయం అందించింది. ఈ సందర్భంగా కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌.గోపీ మాట్లాడుతూ జ్ఞాపకశక్తి మందగించడం, మతిమరుపు, అల్జీమర్స్‌ వంటి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు, సలహాలు అందించడానికి ఈ ప్రత్యేక క్లినిక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి ఈ క్లినిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేర్‌ బి.వి.రమణ, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఎ.రాజేష్‌, ఈసాయి ఫార్మా ప్రతినిధులు గిరీష్‌, జోసెఫ్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement