సిరులతల్లీ.. ప్రణామం.. | - | Sakshi
Sakshi News home page

సిరులతల్లీ.. ప్రణామం..

Nov 28 2025 8:29 AM | Updated on Nov 28 2025 8:29 AM

సిరుల

సిరులతల్లీ.. ప్రణామం..

● వైభవంగా మార్గశిర తొలి గురువారం ● కనకమహాలక్ష్మి దర్శనానికి పోటెత్తిన భక్తులు

కశింకోటలోని

కనకమహాలక్ష్మి అమ్మవారు

డాబాగార్డెన్స్‌ (విశాఖ)/కశింకోట/యలమంచిలి: మార్గశిర మాసం తొలి గురువారం రోజున కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమల పరిమళాలు, వేద మంత్రాల ఘోష, నాదస్వరాల సవ్వడి నడుమ ప్రత్యేక పూజలు చేశారు. తొలి గురువారం సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, వెండి కవచాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బురుజుపేట జనసంద్రంగా మారింది. కశింకోటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చీరలు, రవికెలు, అరటి గెలలను అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారికి వేకువజామున క్షీరాభిషేకం చేసి నూతన వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు. యలమంచిలి పట్టణంలోని ధర్మవరం కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం తొలి గురువారం పూజలు ఘనంగా జరిగాయి. అర్ధరాతి దాటిన తర్వాత మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అర్రెపు గుప్తా దంపతులు అమ్మవారికి తొలి పూజ చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

సిరులతల్లీ.. ప్రణామం..1
1/3

సిరులతల్లీ.. ప్రణామం..

సిరులతల్లీ.. ప్రణామం..2
2/3

సిరులతల్లీ.. ప్రణామం..

సిరులతల్లీ.. ప్రణామం..3
3/3

సిరులతల్లీ.. ప్రణామం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement