ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దేవరాపల్లి: దళారీ వ్యాపారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. కొత్తపెంట రైతు సేవా కేంద్రంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తో కలిసి ఆమె గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి సేకరించిన నమూనాలను, గ్రేడింగ్ విధానాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం క్వింటా ధాన్యం బస్తాకు రూ. 2389, సాధారణ రకం క్వింటాకు రూ. 2369లకు కొనుగోలు చేస్తున్నామన్నారు. జాప్యం వహించకుండా పా రదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార్లకు ఆదేశించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించిన రబీ విత్తనాలను ఆమె రైతులకు అందజేశారు. ఆర్డీవో ఎస్.కె.ఆయిషా, జిల్లా పౌరసరఫరాల అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జె.జయంతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎం.ఆశాదేవి, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, కొప్పులవెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి.కుమార్, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, మండల వ్యవసాయ అధికారి వై.కాంతమ్మ పాల్గొన్నారు.


