సత్యసాయి బోధనలు అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి బోధనలు అనుసరణీయం

Nov 24 2025 7:32 AM | Updated on Nov 24 2025 7:32 AM

సత్యసాయి బోధనలు అనుసరణీయం

సత్యసాయి బోధనలు అనుసరణీయం

సత్యసాయిబాబాకు నివాళులర్పించిన

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

అనకాపల్లి: కలెక్టర్‌ కార్యాలయంలో భగవాన్‌ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగవాన్‌ సత్యసాయి బాబా బోధనలు సేవ, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం వంటి మానవ విలువలకు ప్రతీకగా నిలిచాయన్నారు. బాబా సేవా తత్వాన్ని అనుసరిస్తూ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, సత్యసాయి ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడు అప్పలనాయుడు, గవర కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మళ్ల సురేంద్ర, సత్యసాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement