ఇలా చెప్పి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారా.?
స్టీల్ సెక్టార్‌లో ఎక్కడా ఇవ్వనటువంటి సర్క్యులర్ జారీ చేయడం గర్హనీయం. మూడు ఫర్నేస్‌ల నుంచి 21 వేల టన్నుల ఉత్పత్తి చేయాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా 17 వేల టన్నులే ప్లాంట్ చరిత్రలో అత్యధికం. అలాంటిది 21 వేల టన్నుల టార్గెట్ ఏమిటి? నిన్న లైమ్ లేక.. ఒక ఫర్నేస్ షట్‌డౌన్ చేశారు. ఇలా ఉన్నప్పుడు ఏ లక్ష్యం సాధ్యమవుతుంది? ఉద్యోగులకు ఆర్థిక సాయం చేస్తున్నా.. పని చేయడం లేదని బూచిగా చూపించి ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకే చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. సర్క్యులర్ రావడం, సీఎం మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం, యాజమాన్యం కలిసి ఆడుతున్న నాటకంలా అనిపిస్తోంది. 4 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.30 వేల కోట్లు సహాయం ప్రకటించింది. 0.7 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న కర్ణాటకలోని భద్రావతి స్టీల్స్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చింది. మరి 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న వైజాగ్ స్టీల్స్‌కు ఎంత రావాలి? దీనిపై చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని నిలదీయకుండా ఉద్యోగులపై నింద మోపుతున్నారు?
– డీవీ రమణారెడ్డి,
వైఎస్సార్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి


