తీరం.. వనం.. జనం..
ఆరిలోవ/ఏయూక్యాంపస్: కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. నగరవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గత రెండు, మూడు వారాలతో పోలిస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, పర్యాటక కేంద్రాలకు భారీగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆర్.కె బీచ్ తీరం జనసమ్మర్థంగా మారింది. ఆర్.కె బీచ్ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు ఉన్న రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. తెన్నేటి పార్కు, సీతకొండ వ్యూ పాయింట్ వద్ద కూడా యువత ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. అలాగే కంబాలకొండ, కై లాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్కు, ముడసర్లోవ పార్కు వంటి ప్రాంతాలు వేలాది మంది పర్యాటకులతో నిండిపోయాయి.
కంబాలకొండలో ఉల్లాసం
కంబాలకొండలో సందర్శకులు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఇక్కడి కొలనులో బోటింగ్ చేస్తూ.. జిప్ లైనర్‌పై వేలాడుతూ... బర్మా బ్రిడ్జిపై నడుస్తూ సందడి చేశారు. పిల్లలు ఆట పరికరాల్లో ఆడుకుంటూ.. పెద్దలు సహ పంక్తి భోజనాలు చేస్తూ సరదాగా కనిపించారు. కంబాలకొండకు ఆదివారం సుమారు 1000 మంది సందర్శకులు రాగా, వారి ద్వారా రూ. 70,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
జూ ఆదాయం రూ 8.02లక్షలు : ఇందిరా గాంధీ జూ పార్కుకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఎక్కువ మంది కుటుంబాలతో ఇక్కడ వనభోజనాలు చేశారు. ఆదివారం ఒక్కరోజే 11,099 మంది జూ పార్కును సందర్శించారని క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రికార్డు స్థాయిలో రూ. 8,02,056 ఆదాయం లభించిందని, ఇది గత వారం కంటే సుమారు రూ.2 లక్షలు అధికమని పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాలకు పోటెత్తిన సందర్శకులు
తీరం.. వనం.. జనం..
తీరం.. వనం.. జనం..
తీరం.. వనం.. జనం..
తీరం.. వనం.. జనం..
తీరం.. వనం.. జనం..
తీరం.. వనం.. జనం..


