యువతి ఆత్మహత్య
నర్సీపట్నం: నర్సీపట్నం శారదనగర్‌లో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు అందించిన వివరాలు.. నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామానికి చెందిన కె.దుర్గాదేవి (28) నర్సీపట్నంలో ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. పట్టణంలో శారదనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఆదివారం యువతి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి తండ్రి లేడు. తల్లి, సోదరి ఉన్నారు. తల్లి మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.


