 
															రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకాలు
చోడవరం: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 25 నుంచి రెండ్రోజుల పాటు అనంతపురంలో 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్యోరుగి, ఫూమ్‌సే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు బంగారు పతకాలు, ముగ్గురు రజతాలు, ఒకరు కాంస్య పతకం సాధించారు. చోడవరానికి చెందిన మిండ్రాన హేమశ్రీ రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. గుద్దేటి శశివర్థన్ మూడు విభాగాల్లో బంగారు, రజతం, కాంస్య పతకాలు సాధించారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల కేజీబీవీ విద్యార్థినులు పి. ప్రవళ్లిక బంగారు పతకం, కె. గోవిందమ్మ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఓవరాల్ చాంపియన్‌షిప్ మూడో స్థానం దక్కిందని ఏపీ తైక్వాండో అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు, కోచ్ పల్లం మురళి తెలిపారు. పతకాలు సాధించిన విజేతలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరంతా ఈ నెల 31వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విజేతలను అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు అభినందించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు
 
							రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
