 
															అన్నదాత గుండెల్లో తుపాను
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వర్షాలు తగ్గినా వదలని కన్నీళ్లు 
సాక్షి, అనకాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిశాయి. ఈ నెల 27 నుంచి 29వ తేది వరకు సగటున 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురవడమే కాకుండా తీర ప్రాంత మండలాలైన పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, సబ్బవరంతోపాటు కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. బలంగా ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లపై పడి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి నీరు ఎక్కువగా చేరడంతో పెద్దేరు, తాండవ, రైవాడ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదకరంగా మారాయి. వాటి నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం, భారీ వర్షాలకు వంతెనలపై నుంచి వాగులు, గెడ్డలు పొంగి పొర్లడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి.
జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు 10,180 ఎకరాల్లో పంట దెబ్బతింది. వీటిలో 8,180 ఎకరాల్లో వరి పంట, 1500 ఎకరాల్లో చెరకు, 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 2 వేల ఎకరాలు, చోడవరం నియోజకవర్గంలో 3 వేలు, యలమంచిలిలో 2 వేలు, పాయకరావుపేటలో 500, నర్సీపట్నంలో 580, మాడుగులలో 600, సబ్బవరం, పరవాడ మండలాల్లో 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లావ్యాప్తంగా 31 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 210 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 పశువులు మృతి చెందగా.. జిల్లాలో 32 రహదారులు వరద నీటి ప్రభావంతో దెబ్బతిన్నాయి. జిల్లాలో తీర ప్రాంతం, లోతట్టు 136 గ్రామాలలో నివసిస్తున్న 3,902 మందిని గుర్తించి సురక్షితంగా 68 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 76 పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ బుధవారం నాటికి పునరావాస కేంద్రాల్లో సగం మంది కూడా లేరు. అదేవిధంగా నక్కపల్లి వీవర్స్ కాలనీలో వర్షం నీరు చేరింది. నేత కార్మికులు మగ్గాల్లోకి నీరు చేరడంతో రెండు రోజులుగా నేత నేసేందుకు ఇబ్బంది ఏర్పడిందని నేత కార్మికులు చెబుతున్నారు. మగ్గాలు తడిసిపోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు
తుపాను ప్రభావంలో జిల్లాలో 150.67 కి.మీ మేర 32 ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం, బుచ్చెయ్యపేట, యలమంచిలి, పరవాడ, ఎస్.రాయవరం, నక్కపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, చీడికాడ, కశింకోట, నాతవరం, అచ్యుతాపురం మండలాల పరిధిలో రోడ్లు పాడయ్యాయి. వీటిలో ప్రధానంగా నర్సీపట్నం–భీమునిపట్నం బీఎన్ రోడ్డుపై, సబ్బవరం మండలంలో గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్‌వే పై నుంచి, కోటపాడు–పినగాడి రోడ్డులో మొగలిపురం శివార్లలో రోడ్డుపై నుంచి, ఆరిపాక–రాయపుర అగ్రహారం రోడ్డులోని పెద్దగెడ్డ బ్రిడ్జిపై నుంచి, చోడవరం–సబ్బవరం రోడ్డులోని టెక్కలిపాలెం జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా ప్రవహించడంతో, బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది గ్రామంలో పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో తట్టబంద–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గొంప–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండకర్ల నుంచి గనపర్తి రోడ్డుల్లో ఒక కల్వర్ట్, చీడికాడలో జి.కొత్తపల్లి గ్రామంలో ఒక కల్వర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 380 డ్రెయిన్లు వర్షపునీటితో బ్లాక్ అయ్యాయి.
ధ్వంసమైన ఇళ్లు: జిల్లావ్యాప్తంగా 210 ఇళ్లు ధ్వంసం అవ్వగా.. వాటిలో 48 పెంకుటిళ్లు, శ్లాబ్ ఇళ్లు ఉన్నాయి. 162 పాకలు, పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. కోటవురట్ల మండలం రామన్నపాలెంలో పెంకుటిల్లు కూలిపోయింది. రావికమతం మండలం టి.అర్జాపురంలో వేములపూడి రేకుల షెడ్డుపై చెట్టు పడడంతో ధ్వంసమైంది. ధర్మవరంలో రేకుల ఇంటిపై, యలమంచిలి సోమలింగపాలెంలో మరో ఇంటిపై చెట్టు కూలడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పాఠశాలల్లో పెచ్చులూడిన శ్లాబ్‌లు: అనకాపల్లి మండలంలో 41 ప్రభుత్వ స్కూళ్లలో శ్లాబ్‌లు పెచ్చులూడిపోయాయి. 48 స్కూళ్లలో గదుల్లో వర్షపు నీరు లీకై ంది. 23 స్కూళ్లలో ప్రహరీలు దెబ్బతిన్నాయి. 9 స్కూళ్లలో కిచెన్ షెడ్‌లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
రోడ్డుపై పడిన భారీ వృక్షాలు: జిల్లావ్యాప్తంగా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు బలంగా వీచడంతో 33 భారీ వృక్షాలు రోడ్డుపై పడిపోయా యి. ఎటువంటి ప్రాణనష్టం కలగకపోయినా..వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది
రైవాడ జలాశయం గేట్ల నుంచి విడుదలవుతున్న వరద నీరు
దేవరాపల్లి: రైవాడ జలాశయం వరద గేట్లపై నుంచి నీటి విడుదలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
మూడు రోజులపాటు సగటున
12.8 సెం.మీ వర్షపాతం
ప్రమాదకరంగా జలాశయాలు..
పొంగిపొర్లుతున్న వాగులు
జిల్లాలో 10,180 ఎకరాల్లో
పంట నీట మునక
పడిపోయిన 31 విద్యుత్ స్తంభాలు,
160 ఇళ్లు ధ్వంసం
13 పశువులు మృతి
150 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న
32 రహదారులు
76 పునరావాస కేంద్రాలకు
3902 మంది తరలింపు
 
							అన్నదాత గుండెల్లో తుపాను
 
							అన్నదాత గుండెల్లో తుపాను
 
							అన్నదాత గుండెల్లో తుపాను
 
							అన్నదాత గుండెల్లో తుపాను
 
							అన్నదాత గుండెల్లో తుపాను
 
							అన్నదాత గుండెల్లో తుపాను

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
