ఖరీఫ్ వర్షాలు ఆలస్యం కావడంతో ఇటీవల రెండు ఎకరాల పొలంలో నాట్లు వేశాను. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి అయ్యింది. మోంథా తుఫాన్‌తో మొత్తం నీట మునిగింది. ఇప్పుడు పైనుంచి వరద నీరు పొంగుతూ వస్తుంది. ఇంకా తగ్గలేదు. పూర్తిగా పాడయ్యేలా ఉంది. అధికారులు పరిశీలించి పరిహారం ఇప్పించాలి.
– కాసెపు శివ, రైతు, సర్వసిద్ధి,
ఎస్.రాయవరం మండలం
వ్యవసాయాన్నే నమ్ముకున్నాం
తుపాన్ కారణంగా రెండు ఎకరాల్లో వరి పంట నేలకొరిగి తడిచి పోయింది. సుమారు రూ.50 వేలు పెట్టుబడులు పెట్టగా వరి కంకులు వేసి చేతికి పంట వచ్చే సమయంలో దెబ్బతింది. తిండి గింజలు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. అధికారులు పంట నష్టం నమోదు చేసి ఆదుకోవాలి.
–నందం శివ, ఎం.బి.పాలెం,
రైతు, బుచ్చెయ్యపేట మండలం
అధికారులు ఆదుకోవాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
