 
															వరద బీభత్సం
వైఫల్యానికి మూల్యం.. 
రాంబిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం పొందినముంపు గ్రామాల బాధితులు
రాంబిల్లి మండలంలో రజాల అగ్రహారం వద్ద నీట మునిగిన వరి పంట
అష్ట దిగ్భంధనంలో వై.లోవ
శారదా నదికి రెండో వైపున్న కలవలాపల్లి, వై.లోవ గ్రామాల్లోకి శారదా నది నుంచి వచ్చిన వరద నీటితో తమ పుట్టీలు, వలలు కొట్టుకుపోయాయని స్థానికులు చేసిన ఫిర్యాదుకు స్పందన లేకపోయింది. భవిష్యత్ అవసరాల కోసం నేవల్ బేస్ తీసుకున్న కొండల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం వై.లోవ ముంపు తీవ్రత పెరిగేందుకు కారణం అయ్యింది. వై.లోవ పరిధిలో నిరాశ్రయులైన 30 కుటుంబాలను రాంబిల్లి పునరావాసానికి గురువారం తరలించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్‌కు సహకరిస్తున్న అఽధికారులు గ్రామాల తరలింపు, పునరావాసం, నదుల గట్ల పటిష్టత, అప్రమత్తతపై శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వరద వల్ల ఐదు వేల ఎకరాలు నీట మునగగా..1056 ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యాయని జిల్లా స్థాయి అధికారి సెలవివ్వడం గమనార్హం.
 
							వరద బీభత్సం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
