 
															కొట్టుకుపోయిన పేట డైవర్షన్ రోడ్డు
బుచ్చెయ్యపేట: మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా పలు ఇళ్లల్లోకి వరద నీరు పొంగి ప్రవహించింది. బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ రోడ్డు కోతకు గురై గండి పడింది. వడ్డాది పెద్దేరు నదిపై డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీట మునిగి కోతకు గురైంది. రాజాం, సీతయ్యపేట రోడ్డులో అప్పలనాయుడు చెరువులో నీరు పొంగి రోడ్డుపై ప్రవహించింది. రాజాం వద్ద నీటి ప్రవాహంలో బైక్‌పై వెళుతున్న యువకులు అదుపు తప్పి నీటిలో పడిపోగా ప్రమాదం తప్పింది. పోలీసులు నీటి ప్రవాహంలోకి వెళ్లకుండా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పలువురు వాహనదార్లు, పాదచారులు నీటిలో నుంచి వెళ్లడానికి తీవ్ర అవస్ధలు పడ్డారు. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పంట పొలాల్లో చేరిన వరద నీరు బయటకు పోయేలా రైతులు పొలం గట్లకు గండి కొడుతున్నారు.
 
							కొట్టుకుపోయిన పేట డైవర్షన్ రోడ్డు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
