కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
కశింకోట: మండలంలోని బయ్యవరంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న కారు బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్క నడిచి వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొంది. వారిలో కృష్ణ అనే వ్యక్తి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరడంతో అతనిని, గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయనగరానికి చెందిన ఈ ఇద్దరు క్షతగాత్రులు బయ్యవరం ప్రైవేటు పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. బార్బర్ దుకాణానికి బయ్యవరం గ్రామం వద్దకు నడిచి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు


