ప్రమాద స్థాయికి చేరువలో ‘తాండవ’
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం పెరుగుతోంది. తుపాను కారణంగా ఎగువ ప్రాంతం నుంచి నీరు అధికంగా రావడంతో గురువారం సాయంత్రానికి 377.6 అడుగులకు నీరు చేరింది. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా నీటిమట్టం 378 అడుగులకు వచ్చేసరికి హెచ్చరికలు జారీ చేస్తారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్‌ఫ్లోను బట్టి స్పిల్‌వే గేట్ల ద్వారా నదిలోకి నీరు విడుదల చేసి ప్రమాద తీవ్రతను తగ్గిస్తారు. గురువారం ఎగువ ప్రాంతం నుంచి 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని, పంట కాలువల ద్వారా 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు.


